Rajiv Gandhi : రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తాం : కేటీఆర్ సంచలన కామెంట్స్

by Ramesh N |   ( Updated:2024-08-19 15:27:38.0  )
Rajiv Gandhi : రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తాం : కేటీఆర్ సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయం ముందు తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ సచివాలయం అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉండేదని అన్నారు. తర్వాత సచివాలయం, అంబేడ్కర్ స్టాట్యూ, అమరుల స్థూపం మధ్య ఐల్యాండ్ కట్టామన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్.. అంబేడ్కర్ విగ్రహానికి దండ కూడా వేయడని, 125 అడుగు అంబేడ్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు కూడా కనీసం లైటింగ్ ఏర్పాటు చేయడని మండిపడ్డారు.

అయితే ఏ రాజీవ్ గాంధీ అయితే తెలంగాణ బిడ్డ అయిన అంజయ్యను అవమానించారో.. ఆయన పార్కు ఎదురుగా రాజీవ్ విగ్రహాన్ని తెచ్చి పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. నాటి ప్రభుత్వం అంజయ్య పేరు తీసివేసి.. లుంబినీ పార్క్ అని పేరు పెట్టిందన్నారు. నేడు తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్నిపెడుతుందని, దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అమర జ్యోతి ఇప్పటిదాకా ప్రజల కోసం ప్రారంభం కాలేదన్నారు. గత పదేళ్లలో మేము ఏనాడు కూడా పేర్ల మార్పు పైన ఆలోచించ లేదన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ, రాజీవ్ గాంధీ స్టేడియం రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా వాటిని మేము ఏనాడు మార్చడానికి ప్రయత్నం చేయలేదన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తామని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్లోనూ రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలని సూచించారు. వందలాది మంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందన్నారు.

మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్న చోటికి పంపిస్తామని సెటైర్లు వేశారు. ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం మరిచిపోదు తెలంగాణ అని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ప్రాంతీయంగా తెలంగాణ మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతామన్నారు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవానికి, అమరవీరుల త్యాగాలకు అవమానపరిచేలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికే రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలు సరిపోయినన్ని ఉన్నాయన్నారు. మా సోదరీమణి కవిత ఈ రాఖీ పౌర్ణమి పండుగ రోజు మాతో లేకపోవడం బాధాకరమన్నారు. అయినా ఆమెకి న్యాయం లభిస్తుందని సుప్రీంకోర్టుపైన నమ్మకం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.


Read More..

Bhatti vikramarka: గురుకులాల స్థల సేకరణపై భట్టి సమీక్ష

Advertisement

Next Story

Most Viewed