- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు బంధుపై కటాఫ్ పెడ్తాం: మంత్రి కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : రైతుబంధు పథకంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చే రైతుబంధు కటాఫ్ విషయంలో పరిశీలన చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు తక్కువ భూమి ఉన్న అన్నదాతలకు తక్కువ.. ఎక్కువ భూమి ఉన్న వారికి అధికంగా డబ్బులు వస్తున్నాయన్నారు. దీనివల్ల కొంత మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గమనించామని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రైతుబంధుపై పరిశీలన చేస్తామని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని తీసుకువస్తున్నామని, అప్పు తీసుకొచ్చి ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, పవర్, ఎడ్యుకేషన్ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ఉత్పాదక రంగం పైనే దృష్టి సారించినట్లు వెల్లడించారు. 112 లక్షల కోట్ల అప్పును మోడీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ను తిడితే నాలుగైదు ఓట్లు వస్తాయనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో, 2009 ఎన్నికల్లో టీడీపీతో, 2014,2018 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశామని, పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏ ఎన్నికల్లోనూ, కనీసం స్థానిక సంస్థల్లో కూడా బీజేపీతో కలిసి పనిచేయలేదన్నారు. అలాంటప్పుడు బీజేపీకి బీం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు కూడా బీం టీం కాదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయడం లేదని, బీజేపీకి సపోర్టు వల్లనేనని ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు.
ఈడీ విచారణను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్నారని వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని వారు బీజేపీ కి వత్తాసు పలుకుతున్నారా అని ప్రశ్నించారు. దిక్కుమాలిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ మూడోసారి గెలిస్తే మహారాష్ట్రకు పోయి ఎంపీ స్థానాలను గెలుచుకొని బలపడితే నష్టమని కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయన్నారు.
- Tags
- K. T. Rama Rao