- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని కోసం చేసే ప్రతి పోరాటంలో పాల్గొంటాం: సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ కోసం చేసే ప్రతి పోరాటంలో పాల్గొంటామని స్పష్టం చేశారు. మహిళలకు భాగస్వామ్యం లేకుంటే ఎలాంటి వ్యవస్థ అయిన మనుగడ సాధించలేదన్నారు.
తాము మహిళా రిజర్వేషన్ల కోసం ఒకసారి బిల్లు తీసుకొచ్చినా.. అది మధ్యలోనే నిలిచిపోయిందని తెలిపారు. పంచాయతీల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు.. చట్ట సభల్లో ఎందుకు అమల్లోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయి 9 ఏళ్లు అవుతున్నా.. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టలేదని విమర్శించారు. సోమవారం నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కవిత దీక్షకు, ఉద్యమానికి పూర్తిగా మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా సీతారాం ఏచూరి క్లారిటీ ఇచ్చారు.