- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైపిస్టు, షార్ట్ హాండ్ నేర్చుకున్న నిరుద్యోగులకు న్యాయం చేస్తాం : Sabitha Indra Reddy
దిశ, తెలంగాణ బ్యూరో: టైపిస్టు, షార్ట్ హాండ్ నేర్చుకున్న నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని, గ్రూప్-4 నోటిఫికేషన్ లో టైపిస్ట్, షార్ట్ హాండ్ పోస్టులు ఉండేలా కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. గ్రూప్-4 నోటిఫికేషన్ లో టైపిస్ట్, షార్ట్ హాండ్ పోస్టుల గురించి ప్రస్తావనే లేకపోవడంతో రాష్ట్రంలోని 50వేల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హాండ్ కంప్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రికి మంగళవారం హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర టైపురైటింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి సతీష్ బాలిగ మాట్లాడుతూ.. ఏళ్ల చరిత్ర కలిగిన టైపురైటింగ్ వ్యవస్థ అన్నారు. గ్రూప్-4 లో టైపిస్ట్, షార్ట్ హాండ్ పోస్టుల ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు. కోర్సుల్లో ఉత్తీర్ణులై కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశ కలిగించిందన్నారు. ఈ విషయం పై చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీప్ సెక్రటరీ (ఫైనాన్స్), ప్రిన్సిపల్ సెక్రటరీ (ఉన్నత విద్యాశాఖ), టీఎస్ పీఎస్సీ చైర్మన్ కు రాష్ట్ర టైపురైటింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డిఅధ్యక్షతన వినతిపత్రాలు ఇచ్చామన్నారు. గ్రూప్-4 పోస్టులకు టైపురైటింగ్ హైయ్యర్ మరియు షార్ట్ హాండ్ హైయ్యర్ అర్హత తప్పనిసరి చేస్తే 50వేల నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. స్పందించిన మంత్రి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పద్మ, రమేశ్వరచారి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.