ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను పూర్తిగా పక్షాళన చేస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహా

by Satheesh |
ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను పూర్తిగా పక్షాళన చేస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహా
X

దిశ, సిటీ బ్యూరో: నిర్జీవమైపోయిన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొత్త గా ఏర్పడిన తమ ప్రభుత్వం ఇప్పటికే 17 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, త్వరలోనే తమ సర్కారు 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తేనున్నట్లు స్పష్టం చేశారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. స్ట్రీట్ వెండర్లుకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు తీసుకునేలా అవగాహన ను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లు లను తనిఖీలను మున్ముందు మరింత ముమ్మరం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్‌పైన తనిఖీలు నిర్వహించి, ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆహారాన్ని కల్తీ చేసే సంస్థల లైసెన్స్లను రద్దు చేస్తాయాలంటూ మంత్రి అల్టిమేటం జారీ చేశారు. తమ సర్కారు ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.


Advertisement

Next Story

Most Viewed