- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువ జర్నలిస్టు యోగి ఆత్మహత్య.. కూతురుకు ఉరేసిన వైనం
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ యువ జర్నలిస్ట్, తొలి వెలుగు ఛానెల్ స్టాఫర్‌గా పనిచేస్తున్న యోగి ఉరేసుకున్నాడు. ఆయన కూతురుకు కూడా ఉరి వేయడం సంచలనంగా మారింది. యోగి అక్కడికక్కడే మృతి చెందగా... కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరగగా, యోగి సన్నిహితులు ఆలస్యంగా గుర్తించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కుకు సమీపంలో అద్దె రూంలో ఉంటున్న యోగి..శుక్రవారం ఉదయం నుంచే రూం నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. యోగి సన్నిహితులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో ఎంత పిలిచినా స్పందించకపోవడంతో అనుమానంతో డోర్లు తొలగించి చూశారు. యోగి ప్రాణాలు కోల్పోయి కనిపించగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆయన కూతురును కొంతమంది జర్నలిస్టులు, సన్నిహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యోగి ఆత్మహత్యకు ఎందుకు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. కుటుంబ సమస్యలే కారణమా..? మరేదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
అగ్రసివ్ జర్నలిస్ట్..!
జర్నలిజంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న యోగి రెడ్డికి మంచి పేరు ఉంది. అగ్రెసివ్‌గా ఉండేవాడు. జర్నలిస్టుల సమస్యలపై గళం వినిపించేవాడు. సామాజిక మాధ్యమాల్లోనూ తరుచూ జర్నలిస్టుల సమస్యలపై చర్చ పెట్టేవాడు. జర్నలిస్టుల సమస్యల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటూ పలుమార్లు ప్రకటించాడు. యోగి ఆత్మహత్య ఘటనతో ఓరుగల్లు జర్నలిస్టులు షాక్‌కు గురయ్యారు. యోగితో సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులు కన్నీటి పర్యంతమవుతున్నారు.