మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించాలి: నాబార్డ్‌ ఏజీఎం చంద్రశేఖర్

by Kalyani |
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించాలి: నాబార్డ్‌ ఏజీఎం చంద్రశేఖర్
X

దిశ, పెద్దవంగర: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించేందుకు నాబార్డ్‌ ప్రోత్సాహం అందిస్తుందని నాబార్డ్‌ ఏజీఎం చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సొసైటీ ఫర్ లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చిరు ధాన్యాలు, ఉపాధిపై మహిళలకు 90 రోజుల వాల్యు ఆడిషన్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ మిల్లెట్స్ శిక్షణ శిబిరంలో మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శిక్షణ పొందిన ప్రతిఒక్కరూ తమ ఊరిలోనే యూనిట్‌ను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. శిక్షణ పొందిన మహిళలు యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించేందుకు సహకరిస్తామన్నారు. మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఈఓ లత, సైంటిస్ట్ స్వరూప, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story