- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేస్తా: డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
దిశ, వరంగల్ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతానని జనగామ డీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్ ఫశ్చిమ నియోజకవర్గం కాజీపేట 63వ డివిజన్‌లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టారు. యాత్ర చివరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా..? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
‘ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయిని రాజేందరెడ్డి స్థానికుడు కాదు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేదు. నాది ఇదే ప్రాంతం. ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు నాకు తెలుసు. వాళ్లకు ఏం కావాలో, వారి సమస్యలు ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. నాయిని కూడా నా కోసం పనిచేస్తాడు. అవసరమైతే రెండు మూడు కోట్లు కూడా ఖర్చు పెడుతాడు. నా గెలుపు కోసం పనిచేస్తాడు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వరంగల్ పశ్చిమ టికెట్ నాదే, గెలుపు నాదే’ అంటూ జంగా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. రాఘవరెడ్డి చేసిన వాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.