కాంగ్రెస్ మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో.. : హరీష్ రావు

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో.. : హరీష్ రావు
X

దిశ,తొర్రూరు: ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పీఎస్ఆర్ స్కూల్ మైదానంలో పాలకుర్తి నియోజకవర్గ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

హరీష్ రావు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజార్టీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అన్నారని , రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారని, అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

60 ఏళ్లుగా జరగని అభివృద్ధి గత 10 సంవత్సరాలలో అన్ని రంగాల్లో మన పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, గత ఐదు సంవత్సరాలలో 4200 కోట్లతో పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బస్సు మినహా అంతా తుస్సే. ఏమైంది మీ హామీలు.. ఏమైంది మ్యానిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అసలు వస్తాయా అన్న సందేహం ప్రజల్లో వచ్చేసిందని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తుక్కు తుక్కుగా ఓడిస్తారని దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నారన్నారు.

మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ఊరంతా చుట్టి వచ్చాయి, మన నిజం మాత్రం గడప కూడ దాటలేదు అని చెప్పుకోవడంలో మనం విఫలం చెందాం.. కాంగ్రెస్ పార్టీ నీ బొంద పెట్టేందుకు ప్రజలు మే 13 కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం..కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బస్సు యాత్ర మొదలు పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు పిల్లర్లు పాడైతే వాటిని మరమ్మతులు చేయాల్సింది పోయి నీరు మొత్తం సముద్రంలోకి విడిచి పెట్టారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించామని తల పట్టుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ మారేపల్లి సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని సురేందర్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని సభను విజయవంతం చేశారు అని అన్నారు.



Next Story

Most Viewed