Andhra Pradesh news : మంత్రి అమర్నాధ్ సవాల్.. పెద్ద జోక్!

by Mahesh |   ( Updated:2024-05-05 12:06:04.0  )
Andhra Pradesh news : మంత్రి అమర్నాధ్ సవాల్.. పెద్ద జోక్!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వయస్సు, స్థాయి మరచి ఎవరిపైనైనా అర్థం పర్థం లేకుండా విరుచుకుపడుతూ తరచూ అభాసుపాలయ్యే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఈ సారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే సవాల్ విసిరి ఇరకాటంలో పడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయమనే హామీ ఇస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, గాజువాక అసెంబ్లీ బరిలో నుంచి తప్పుకుంటానని శనివారం అమర్ ప్రకటించారు. ఇప్పుడు ఇది పెద్ద కామెడీ అయిపోయింది.

పదవి ఎన్ని రోజులు వుందని చేయడానికి?

అమర్‌కి పదవి ఇంకా ఎంతకాలముంది రాజీనామా చేయడానికి అని ప్రతిపక్షాలు నేతలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల్లో పోలింగ్ పెట్టుకొని ఇదేం సవాల్ అని నిలదీస్తున్నారు. నిన్నటి వరకు అదే ప్రధానికి వంగి వంగి దండాలు పెట్టి ఆయన గతంలో విశాఖ వచ్చినప్పుడు ఉక్కు గురించి ఒక్కసారీ ప్రస్తావన చేయని అమర్ వంటి నేతలా ఇలా సవాల్ చేసేదని ప్రశ్నిస్తున్నారు. సవాల్ చేస్తే ప్రత్యర్థులు ప్రతి సవాల్ చేసే విధంగా ఉండాలి కానీ పవర్ లేని మంత్రి అమర్ సవాల్ ప్రధాని వరకు చేరుతుందా? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. గాజువాక నుంచి తప్పుకోనవసరం లేదని జనమే ఓటు ద్వారా తప్పిస్తారని కూటమి పక్షాల నేతలు ప్రతి దాడి చేస్తున్నారు.

మంత్రిగా విశాఖ ఉక్కుకు ఇసుకే ఇవ్వలేదు.. ఇప్పడు సవాళ్లా?

సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి కూడా తన పరిధిలోని ఇసుక లైసెన్స్ ను స్టీల్ ప్లాంట్ కు రెన్యువల్ చేయించడం చేతకాని అమర్ ఇప్పుడు పెద్ద కబుర్లు పెట్టడమేమిటని స్టీల్ పరిరక్షణ ఉద్యమ కారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర నోరు మెదిపే ధైర్యం లేని అమర్ ఏకంగా ప్రధానికి సవాల్ విసిరి తన రాజకీయ అపరిపక్వతను చాటుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గంగవరం సమ్మె అప్పుడు ఏం చేశారు?

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన అదానీ గంగవరం పోర్టు లో నిన్నటి వరకు జరిగిన సమ్మె విరమింప చేయడానికి ఎందుకు ప్రయత్నించ లేదనే విమర్శలకు మంత్రి వద్ద సమాధానమే లేదు. తన మంత్రిత్వ శాఖ ద్వారా చేయాల్సిన పనులు వదిలేసి పనికిరాని, పస లేని సవాళ్ళు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఓటుకు ఎదురీదుతున్న నోటి మంత్రులు

ముద్రగడకు ముచ్చెమటలు పట్టిస్తున్న కన్న కూతురు.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో వీడియో వైరల్..


Advertisement

Next Story

Most Viewed