ఆ స్టార్ హీరో పెళ్లి అబ్బాయితో జరిగిందా? 💯 అదే జరిగింది.. నెట్టింట వీడియో వైరల్

by Dishafeatures3 |
ఆ స్టార్ హీరో పెళ్లి అబ్బాయితో జరిగిందా? 💯 అదే జరిగింది.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో షాహిద్ కపూర్ ముందుగా కరీనా కపూర్ తో ప్రేమాయణం నడిపాడు. కానీ ఆ రిలేషన్ పెళ్లి దాకా వెళ్లలేదు. ఆమె సైఫ్ అలీ ఖాన్ తో ఏడడుగులు వేస్తే.. షాహిద్ మీరా రాజ్ పుత్ మెడలో తాళి కట్టేసాడు. ఆ అమ్మాయి రిచ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ తో ఉండటంతో అందరూ కరీన కన్నా బెటర్ ఆప్షన్ అనుకున్నారు. ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. అయితే హీరోయిన్ తో సమానంగా అందాన్ని మెయింటేన్ చేసే మీరా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. పలు బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా షో స్టాపర్ గా అవకాశం దక్కించుకుంది.

హీరోయిన్లను, మోడల్స్ ను కాదని మీరాకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. బ్యూటిఫుల్ లెహంగలో ర్యాంప్ వాక్ చేసిన ఆమె అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా నడిచిందనే విమర్శలు వచ్చాయి. 'దబాంగ్' లో సల్మాన్ ఖాన్ లా ఆ వాకింగ్ స్టైల్ ఏంటి అని నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. హండ్రెడ్ పర్సంట్ షాహిద్ పెళ్లి అబ్బాయితోనే జరిగిందని కామెంట్స్ వస్తున్నాయి.

కాగా ' అర్జున్ రెడ్డి ' రీమేక్ ' కబీర్ సింగ్ ' లో నటించి మెప్పించిన షాహిద్.. ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ గా ఎంచుకుంటూ టాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు పొందాడు. రీసెంట్ గా 'ఫర్జీ' తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. విజయ్ సేతుపతితో కలిసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.


Next Story