- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదు.. బీఆర్ఎస్ నాయకులు..
దిశ, పెద్దవంగర : ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదు. కానీ గిరిజనుల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని గిరిజన రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రను తిప్పికొడతామన్నారు.
వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేద గిరిజనుల జోలికొస్తే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాయాలని చూస్తే ఊర్కునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, నాయకులు వెంకన్న నాయక్, బాలు నాయక్, హేమని నాయక్, దశరథ్ నాయక్, శ్రీను నాయక్, శంకర్ నాయక్, వెంకట్రామయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.