ఫేక్ జాబ్ ముఠా గుట్టురట్టు..

by Sumithra |
ఫేక్ జాబ్ ముఠా గుట్టురట్టు..
X

దిశ, హనుమకొండ టౌన్ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే నమ్మదగిన సమచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, నర్సంపేట పోలిసులు కలసి ఆదివారం ముగ్గురు నిందితుల ను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలు కొరిబిల్లి ఉపేంద్ర విశాకాపట్నం, ఆంధ్రప్రదేశ్, గంటి గౌతం ధర్మవరం, తూర్పుగోదావరి జిల్లా, ఏ.పీ మంగలంపాటి వీరయ్య మంగళగిరి గుంటూరు జిల్లా, ఏ.పీ లను పట్టుకొగ నలుగురు నిందితులు పరారిలో ఉన్నారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏసిపి ఏం.జితేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వీరి దగ్గర నుండి రూ. 3,00,000 నగదు, ల్యాప్టాప్, ఫేక్ కాల్ లెటర్స్, ఫేక్ సలారీ స్లీప్స్, 5 చరవాణిలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల వివరాలు.. నర్సంపేటలోని శాంతినగర్ కు చెందిన రాయపర్తి రమేష్, రాయపర్తి వెంకటేశ్వర్లు, రాయపర్తి సంతోషిమాత, రాయపర్తి పుష్పలత వీరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ వీరందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి రైల్వే డిపార్ట్మెంట్ లో క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ కాల్ లెటర్స్ సృష్టించి నిరుద్యోగుల నుండి పెద్ద మొత్తం లో డబ్బులు వసూలు చేశారు.

ఈ వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని కూడ భూమికి సంబంధంచిన స్థలాల్లో, విలాసవంతమైన జల్సాలకి ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. నిందితులు అందరూ కూడా పరీక్షలు రాయకుండా, ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా ప్రభుత్వ ఉద్యగాల్లో చేరోచ్చని అమాయక యువతకి గాలం వేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో రూ.32 లక్షలకు పైగా దండుకున్నారు. అనంతరం నింధితులతో పాటు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని, సొత్తుని విచారణ నిమిత్తం నర్సంపేట పోలీసులకి అప్పజెప్పినారు. దీనికి సంబందించి వరంగల్ కమీషనరేట్ నర్సంపేట పోలీస్ స్టేషన్ లో Cr.No.186/2023 U/s 420,468,471 r/w 34 IPC నమోదు చేశారు. ఏ.వీ రంగనాథ్, కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏం.జితేందర్ రెడ్డి, గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబందించిన నోటిఫికేషన్స్ వస్తున్నవి కాబట్టి దాన్ని ఉద్దేశించి ఏ ఒక్క నిరుద్యోగ యువతి, యువకులు కూడ ఇలాంటి మోసపూరితమైన అవకాశాలకీ లొంగిపోకుండా ప్రతి ఒక్కరూ కూడ కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు సాంపందిచుకోవలని సూచించారు.

ఆనంతరం నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు కె. శ్రీనివాసరావు, కె.జనార్ధన్ రెడ్డి, ఏ.రాంబాబు, ఎస్సైలు పెండ్యాల దేవేందర్, బి.శరత్ కుమార్, వి.లవన్ కుమార్, డి.రాజు, ఎ.ఎ.ఓ సల్మాన్ పాషా టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్లు అశోక్, స్వర్ణలతా, కానిస్టేబుల్లు శ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేష్, కిరణ్, బిక్షపతి, రాజు, శ్యామ్ సుందర్, సురేష్, మహబూబ్ పాషా, కరుణాకర్, ఏ. శ్రీధర్, విక్రమ్, సతీష్, రమేష్, నరేష్, నవీన్ కుమార్, వి.శ్రీనివాస్, గౌతమ్, శ్రావణ్ కుమార్, నాగరాజులను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed