Warangal Collector : విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు

by Aamani |
Warangal  Collector : విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు
X

దిశ,నల్లబెల్లి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్, బీసీ హాస్టల్ భవనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ టీచర్స్ కి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. పిల్లలకు మంచి విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. అంగన్వాడి సెంటర్ ముందు నడవడానికి వీలు లేకుండా ఉన్నటువంటి బురదను శుభ్రం చేసుకోవాలని ఆమె సూచించారు. బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ భవనానికి మరమ్మతులు చేయుటకు కావలసిన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాకేష్, ఎంపీడీవో నరసింహమూర్తి, ఏపీవో వెంకటనారాయణ, ఎస్సై ప్రశాంత్ బాబు, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story