ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూపులు

by Kalyani |
ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూపులు
X

దిశ‌, మంగ‌పేట : ములుగు జిల్లా మంగ‌పేట మండలం విగ్నేష్ అనే చిన్నారి ప్రాణాల‌తో పోరాడుతున్నాడు. తీవ్ర‌మైన జ్వ‌రంతో ప్లేట్‌లెట్స్ ప‌డిపోవ‌డంతో..అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లోకి చేరుకున్నాడు. త‌మ చేతిలో ఉన్న కాసింత న‌గ‌దుతో హ‌న్మ‌కొండ‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో వైద్యం అందించినా.. చిన్నారికి ఆరోగ్యం సరికాలేదు. దీంతో హైదరాబాద్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో లిటిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. బాబు చాలా సీరియస్ కండిషన్లో ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఖ‌ర్చును భ‌రించ‌లేమ‌ని, త‌మ బాబును ర‌క్షించాల‌ని శెట్టి నరేష్, భూక్య దీపిక ద‌యార్ధ హృద‌యుల‌ను కోరుతున్నారు. స‌హాయం అందించే దాత‌లు 9550301954కు కాల్ చేయాల‌ని, లేదంటే ఫోన్ పే నెంబర్ 8247702021కు న‌గ‌దు పంపించాల‌ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed