- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కుటుంబ సర్వే స్టార్ట్.. పల్లెల్లో చురుకుగా.. పట్టణాల్లో స్లోగా..
దిశ, వరంగల్ బ్యూరో : రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలిరోజు సర్వేకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కుటుంబ సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ప్రజలు నిలదీశారు. వ్యక్తిగత, బ్యాంకు, ఆధార్, ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ఇష్టపడలేదు. అయితే ఈ సమస్య ఎక్కువగా పట్టణాల్లోనే కనిపించింది. గ్రామాల్లో మాత్రం సర్వే పెద్దగా ఆటంకాల్లేకుండానే సజావుగా సాగడం గమనార్హం. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు సర్వే తీరును పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించేందుకు ప్రభుత్వం ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో కలిసి సర్వే తీరు తెన్నులను, ఎన్యూమరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజల సందేహాలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తెలుసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. వరంగల్ జిల్లాలో 8 లక్షల 90 వేల 651 మంది ఉన్నారు. హన్మకొండ జిల్లాలో 10 లక్షల 80 వేల 858 మంది ఉన్నారు. జనగామ జిల్లాలో 5లక్షల 66 వేల 376 మంది ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 7లక్షల 74వేల 549 మంది ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో 4లక్షల 16వేల 769 మంది ఉన్నారు. ములుగు జిల్లాలో 2లక్షల 94వేల 671 మంది ఉన్నారు.
తొలిరోజూ సందేహాస్పదంగానే ముందుకు..!
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే తొలిరోజు అనేక సందేమాల మధ్య ముందుకు నడిచింది. ఈ నెల 1వ తేదీ నుంచి 3 వరకు ఎన్యూమరేటర్లు ఇళ్ల జాబితాను సేకరించారు. 6 నుంచి 8వ తేదీ వరకు మరోసారి ఇళ్లను రివిజన్ చేసి కుటుంబాల లెక్కను పక్కాగా తేల్చారు. ఇంటింటికీ స్టిక్కర్‌ను అంటించారు. గుర్తించిన ఇళ్లలోని కుటుంబాల సర్వేను శనివారం ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులం వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతీ ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్ల సర్వే బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం అందించిన 75 ప్రశ్నల పత్రం నింపడానికి కనీసం అరగంటకు పైగానే సమయం పడుతోంది. ప్రతి రోజు కనీసం పది ఇళ్లకు తగ్గకుండా సర్వే నిర్వహించనున్నారు. సర్వే సమాచారాన్ని ముందస్తుగానే ఆయా కుటుంబాలకు తెలియజేయాల్సి ఉంది. అయితే సర్వేకు వస్తున్నామని ముందస్తుగా సమాచారం అందించినప్పటికీ అందుబాటులో ఉండలేదన్న ఫీడ్‌బ్యాక్ ఎన్యూమరేటర్ల నుంచి ఉన్నతాధికారులకు అందుతోంది.
క్షేత్రస్థాయిలో ప్రత్యేకాధికారి, కలెక్టర్ల పర్యటన.. పరిశీలన
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 19వ డివిజన్ శివాలయం వీధిలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. హన్మకొండ పట్టణంలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పరిశీలించారు. అంతకు ముందు ఉదయం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండల శివారు కొత్తపల్లి ఆవాసం, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ లో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాముల్ శర్మతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద సంగెం మండలం తీగరాజుపల్లి, గవిచర్ల గ్రామాల్లో పర్యటించి సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామంలో జరుగుతున్న సర్వేతీరు తెన్నును పరిశీలించారు. ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ వార్డు నెంబర్.1 లో సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే ఎన్యూమరేటర్లు వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ వద్దని సూచించారు. కుటుంబ సభ్యుల వ్యక్తి గత ఆధార్, మొబైల్ ఫోన్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలియజేయాలని, ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్ వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన ఎన్యూమరేటర్లుకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఈ సర్వేవలన ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి అవకాశం మెరుగవుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్కు అందించి వివరాలను నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి వెసులుబాటు ఉందని తెలిపారు.