కేయూలో విజిలెన్స్ దాడులు…మాజీ వీసీ అక్రమ ప్రమోషన్ పై ఆరా

by Bhoopathi Nagaiah |
కేయూలో విజిలెన్స్ దాడులు…మాజీ వీసీ అక్రమ ప్రమోషన్ పై ఆరా
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేష్ అక్రమాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (అకూట్‌) బాధ్యులు ప్రభుత్వానికి, విజిలెన్స్ అధికారులకు వేరు వేరుగా ఇచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏబాలు కోటి, సీఐ రాకేష్, ఇతర విజిలెన్స్ అధికారుల బృందం కేయూ పాలన భవనం చేరుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్చార్జి రిజిస్ట్రార్ నరసింహ చారి, వర్సిటీ అడిట్, స్టేట్ లోకల్ ఆడిట్ వారిని రిజిస్ట్రార్ ఛాంబర్ కు పిలిపించుకుని అన్ని ఫైల్స్ గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మాజీ వీసీ రమేష్ సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పై ఆరా?

గతంలో నాలుగు సార్లు విజిలెన్స్ అధికారులు వర్సిటీ రిజిస్ట్రార్ కు నోటీసులు ఇచ్చిన కూడా వాటికి సంబంధిత ఫైల్స్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కు సంబంధించిన సెలక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్, ఈసీ మినట్స్ గురించి ఇన్చార్జి రిజిస్ట్రార్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఫార్మసీ, ఇంజనీరింగ్ లలో జరిగిన పీ.హెచ్.డీ అక్రమాలపై కూడా సమాచారం అడిగినట్టు సమాచారం. పీ.హెచ్.డీ అడ్మిషన్లు చేసిన డీన్ లను పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత సర్వీసును అక్రమంగా కలుపుకొని ప్రమోషన్ తీసుకున్న వారి గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed