- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కురవి లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు.. ఓపెన్ సీక్రెట్ అంటున్న ప్రజలు
దిశ, మరిపెడ (కురవి): మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని వేచియుండు గదులు (లాడ్జి)లల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో ఐదు జంటలను అదుపులోకి తీసుకుని, లాడ్జి ఓనర్ పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము నాయక్ తెలిపారు. ఒకచోట రైడింగ్ జరుగుతుండగానే మిగతా చాలా జంటలు పరారైనట్లు సమాచారం.
ఆలయ పేరును వాడుకుని పవిత్రతను దెబ్బతీస్తున్న కేటుగాళ్లు.!
కురవి వీరభద్రుని ఆలయానికి దశాబ్దాల చరిత్ర గలదు కాకతీయుల కాలంలో స్వయంభుగా వెలిసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కోరిన మొక్కలు తీర్చే కోరమీసాల వీరన్న గా ప్రసిద్ధుడు. కానీ కొందరు దుర్బుద్ధితో పైసలే ప్రథమార్థంలో వక్రబుద్ధిని అవలంబిస్తున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నందున అందుకు తగ్గట్టుగా సరైన సౌకర్యాలు లేకపోవడం తో భక్తులు నివసించుటకు లాడ్జిలనే నమ్ముకుంటారు.
దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ లాడ్జి ల పేరుతో ప్రేమ జంటలకు, వివాహిత అవివాహిత జంటలకు ఆశ్రయం కల్పిస్తూ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అసలు భక్తులకు రూములు కిరాయికి లేవంటూనే ఈ జంటలకు ఒక గంటకు సుమారు 400 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకుండా ముందు బాగాన వివిధ కంపెనీలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసి వెనుక భాగాన ఇత తతంగాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం.
ఈ తతంగం అంతా ఓపెన్ సీక్రెట్ అంటున్న ప్రజలు.!
ఈ వ్యవహారంతో అధికారులపైన మండల ప్రజలు ఛీ కొడుతూ మండిపడుతున్నారు. ఈ వ్యభిచార వ్యవస్థ ఇప్పటిది కాదని గత 5 సంవత్సరాల నుండి విరజిల్లుతుంది. రాజకీయ నాయకులు అండదండలతోనే అధికారుల కనుసన్నల్లోనే నెలవారి మామూళ్లతో ఇదంతా నడుస్తుందని, ఇప్పటివరకు ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు ? మీరు ఎన్ని సార్లు స్పందించారు? ఎ లాడ్జిని సీజ్ చేశారు? ఎంతమంది పైన కేసు చేశారు? అంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తుండడం గమనార్హం. ఎంత మందిని అరెస్టు చేసిన ఎన్ని కేసులు అయినా ఇంకొక 15 -20 రోజులలో మళ్లీ షేర మామూలుగానే వ్యవహారం నడుస్తుందంటూ ప్రజలు నొక్కి వక్కి పట్టి చెప్పడం విశేషం. వీళ్ళ మాటలు అర్థం చేసుకున్న మేధావులు కురవి వీరభద్రుడే దిక్కు అంటూ వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు.