వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్..

by Kalyani |
వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్..
X

దిశ, ఏటూరు నాగారం: ములుగు జిల్లా మంగపేట మండలంలో గత కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాల కేసులో ఇద్దరు వ్యక్తులను మంగపేట పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన వారు కమలాపూర్ గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మంగపేట ఎక్స్ రోడ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ప్యాసింజర్ ఆటోను ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో అందులోని ఇద్దరు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో పారిపోతుండగా పట్టుకొని విచారించగా వారు దొంగతనం చేసిన వస్తువులను తీసుకొని మణుగూరు వెళ్లి ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకోవడానికి వెళుతున్నామని చెప్పారు.

వీరి మీద పసరా, తాడువాయి, వెంకటాపురం, వాజేడు స్టేషన్లలతో పాటు మంగపేటలో కూడా కేసులు ఉన్నాయి. నిమ్మల వినయ్ కుమార్ మీద 9కేసులు, నాయక్ గణేష్ మీద రెండు కేసులు ఉన్నాయని, ఇరువురిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేశామని మంగపేట పోలీస్ అధికారులు ఎస్సై తాహర్ బాబ, సీఐ మండల రాజు తెలిపారు.

Advertisement

Next Story