- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కంటే బీజేపీనే పెద్ద వైరస్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దిశ, నర్సంపేట: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లోక్‌సభలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం నల్లబెల్లి మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మను పార్టీ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు యాభై ఏండ్ల కల, ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితమన్నారు. మా కలలు, ఆకాంక్షలను అపహస్యం చేస్తే బీజేపీ పార్టీని బొంద పెడతామని మండిపడ్డారు.
కరోనా కంటే బీజేపీ పెద్ద వైరస్ అని, దాని పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బలవంతపు రైతు చట్టాలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు, కరోనా సమయంలో వలస కూలీల గోసలు, పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభం, పెట్రో ధరల పెరుగుదల లాంటి అనేక సమస్యలు దేశంలో తాండవిస్తున్నాయన్నారు. కానీ, బీజేపీ మాత్రం దేశ భక్తి ముసుగులో మత కల్లోలాలు సృష్టిస్తూ పబ్బం గడుపుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, లేదంటే బీజేపీ నాయకులను రాష్ట్రంలో తిరగనియ్యమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బాణోత్ సారంగపాణి, రైతు సమన్వయ సమితి బాధ్యులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.