గిరిజనులు ఆ ప్లాట్లు అమ్ముకోవచ్చు.. వారిపై చర్యలు తప్పవన్న ఆర్డీవో

by Disha News Desk |
గిరిజనులు ఆ ప్లాట్లు అమ్ముకోవచ్చు.. వారిపై చర్యలు తప్పవన్న ఆర్డీవో
X

దిశ, బయ్యారం: వామ్మో ఏజెన్సీలో భూములకు ఇంత రేటా.. అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య స్పందించారు. శుక్రవారం బయ్యారం మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వెంచర్‌లను ఆయన పరిశీలించారు. హద్దు రాళ్ళను ఆయన తొలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు తమ భూములను అమ్ముకోవచ్చు అని, అనవసరంగా అధికారులపై నిందలు వేయకూడదని వ్యాఖ్యానించారు. వెంచర్‌ల ఏర్పాటుపై పూర్తి నివేదిక ఇవ్వాలని తహశీల్దార్ నాగభవానిని ఆదేశించారు. రెవెన్యూ ,ఫారెస్ట్ చట్టాలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed