పట్టపగలే దొంగల బీభత్సం.. నగదు, బంగారం చోరీ

by Kalyani |
పట్టపగలే దొంగల బీభత్సం.. నగదు, బంగారం చోరీ
X

దిశ, దేవరుప్పుల: పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన దేవరుప్పుల మండల పరిధి మాదాపురం గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపురం గ్రామానికి చెందిన సుంకరి సోమయ్య కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనికి వెళ్లగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముందుగానే పథకం ప్రకారం దొంగలు ఇంట్లో చొరబడి రూ. 4 లక్షలు, మూడు తులాల బంగారాన్ని దొంగిలించారు. భూమి కొనుగోలు చేద్దామని దాచుకున్న డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లడంతో సోమయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story