సుక్క నీటి కోసం చుక్కలు కనబడుతున్నాయి..!

by Sumithra |
సుక్క నీటి కోసం చుక్కలు కనబడుతున్నాయి..!
X

దిశ, మరిపెడ (చిన్నగూడూర్) : చిన్నగూడూరు మండల కేంద్రంలోని స్థానిక వడ్డెర కాలనీ వాసులు త్రాగునీటి సమస్యతో రోడ్డు ఎక్కినిరసన తెలియజేశారు. గత వారం రోజుల నుంచి త్రాగడానికి నీటిచుక్క లేక ఇతర అవసరాలు తీర్చుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. పొద్దుందాక కాయకష్టం చేసిఇంటికి వచ్చి స్నానం చేద్దామన్నా, బట్టలు పిండుకుందామన్న నీళ్లు లేక ఊరు చివరన వున్నా దర్గా చేతి పంపు దగ్గరికి వెళ్లి త్రాగునీరు తీసుకొస్తున్నామని తెలిపారు.

మా బాధలు సర్పంచ్ కి ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవట్లేదని రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నాడని అదే సిబ్బంది ఇంటికి వంద రూపాయలు ఇస్తేనే నీళ్లు వేస్తాను, లేకుంటే మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని మా బాధలు అర్థం చేసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.

Advertisement

Next Story