విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి : కల్నల్ ఎస్కే.భద్ర

by Aamani |
విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి : కల్నల్ ఎస్కే.భద్ర
X

దిశ, వైరా : విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్కే భద్ర అన్నారు. ఎన్‌సీసీ హెడ్ క్వార్టర్ న్యూ డిల్లీ వారు వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ కి 11(టి)వ బెటాలియన్ ఖమ్మం ఆధ్వర్యంలో ఎన్‌సీసీ "బి" సర్టిఫికేట్ కి అనుమతిని పొందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ కె. భద్ర సిబ్బంది కళాశాలను సందర్శించి ఎన్‌సీసీ క్యాడేట్స్ తో ముఖాముఖి చర్చించారు.

ఈ సందర్భంగా ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ కె. భద్ర మాట్లాడుతూ, విద్యార్థులుఎన్‌సీసీ శిక్షణ తీసుకోవటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి, దేశ రక్షణ, జాతీయతా భావం, సామాజిక సేవ వంటి మంచి లక్షణాలు అలవడతాయన్నారు.

కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూఎన్‌సీసీ క్యాడేట్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5శాతం ప్రత్యెక రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు.ఎన్‌సీసీ " బి "సర్టిఫికేట్ సాధించటం వలన ఎన్టీఏ వారు నిర్వహించే జెఈఈ మెయిన్స్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈపిసి ఈ టి వంటి వివిధ రకాలైన పోటీ పరీక్షలలో ప్రత్యేకమైన రిజర్వేషన్ పొంది మరిన్ని అవాకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ సిబ్బంది సుబేదార్ మేజర్ బాల బహుదూర్ పున్, సుబేదార్ రాజారామ్ పాటిల్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఎ.ఓ సామినేని నరసింహారావు , ఎన్‌సీసీ ట్రైనర్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed