గణతంత్ర దినోత్సవం నాడే ఎగరని జాతీయ జెండా.. మండిపడుతున్న ప్రజలు

by Disha News Web Desk |
గణతంత్ర దినోత్సవం నాడే ఎగరని జాతీయ జెండా.. మండిపడుతున్న ప్రజలు
X

దిశ, పాలకుర్తి: 73 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పాలకుర్తిమండల కేంద్రంలో రెండు భిన్నమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ సెక్రటరీ ఆదేశాలు భేఖాతారు చేస్తూ మెడికల్ ఆఫీసర్ ఉదయం 9 గంటలకే జాతీయ పతాకం ఆవిష్కరించి సెక్రటరీ జీవోను సైతం లెక్క చేయలేదు. దీనితో పాటుగా పాలకుర్తిలోని బీసీ హాస్టల్‌లో వార్డెన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు. వేడుకల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తు్న్నారు.


Advertisement

Next Story

Most Viewed