Flood : ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న జంపన్న వాగు

by Aamani |
Flood : ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న జంపన్న వాగు
X

దిశ,తాడ్వాయి: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా తాడ్వాయి లోని మేడారం జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. జంపన్న వాగు బ్రిడ్జి దగ్గరికి, మెట్ల పైకి నీరు వచ్చింది.జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పడిగాపురం,వెంగళాపూర్ చింతల్ క్రాస్, మేడారం, కొత్తూరు, ఊరట్టం, కాల్వపల్లి ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గతంలో జంపన్న వాగు చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల లోకి నీరు వచ్చి ముంచేసింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే పడిగపురం,వెంగలపురం,కాల్వపల్లి మేడారం, కొత్తూరు, ఊరట్టం ఏజెన్సీ గ్రామాల ప్రజలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది, ఇప్పటికే ఏజెన్సీ లోతట్టు గ్రామాల ప్రజలకు స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, మండల ప్రత్యేక అధికారి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సుమన వాని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story