ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : మావోయిస్టు పార్టీ

by Disha News Web Desk |

దిశ, బయ్యారం: కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ, ప్రజా ఉద్యమ కారులపై క్రూరమైన దాడులకు పాల్పడుతున్నాయని మావోయిస్టు పార్టీ ఇల్లందు-నర్సంపేట కమిటీ కార్యదర్శి పాపన్న పేరుతో గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఈనెల 18న వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్న, ఇల్లందు-నర్సంపేట ఏరియా దళ కమాండర్ కైలాష్ గ్రేహౌండ్స్ పోలీసులతో పోరాడి, ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అంతేగాక, దళంపై ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్‌‌కౌంటర్ లేని రాష్ర్టం సాధిస్తామని చెప్పి, రాష్ర్టంలో ఎన్‌కౌంటర్‌లతో పరిపాలిస్తూ దళ సభ్యులను పొట్టన పెట్టుకుంటున్నదని తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా డివిజన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 22న నిర్వహించబోయే బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed