విద్యుత్ ఉప కేంద్రం పనులు అడ్డుకుంటున్న అట‌వీ శాఖ అధికారులు

by Mahesh |   ( Updated:2023-05-15 06:58:29.0  )
విద్యుత్ ఉప కేంద్రం పనులు అడ్డుకుంటున్న అట‌వీ శాఖ అధికారులు
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం పనులను అట‌వీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, చిన్నబోయినపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సోమవారం రోజున ఉప‌కేంద్రం వద్ద అట‌వీశాఖ‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని చిన్న బోయినపల్లి ,పెద్ద వెంకటాపురం, రాయబంధం, హనుమాన్ నగర్, శివాపూర్, గోగుపల్లి, లింగాపూర్, షా పెళ్లి, దొడ్ల కొత్తూరు, దొడ్ల, మల్యాల, కొండాయి, ఐలాపూర్, తదితర మారుమూల ఏజెన్సీ గ్రామల ప్రజలు గత పది ,15, సంవత్సరాలుగా కరెంటు కోతతో సతమతమవుతున్నార‌న్నారు.

కాగా వర్షాకాలం సీజన్ వచ్చిందంటే నిత్యం కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక గ్రామాలు అంధకారంలో ఉండటమే కాకుండా కొన్ని గిరిజన గ్రామాలలో గిరిజన వాసులు రాత్రి వేళలో క్రింద నిద్రిస్తున్న సమయాలలో విష సర్పాల కాటుకి బలి అయినా సందర్భాలు కోకోల్ల‌లుగా ఉన్నాయ‌ని అవేద‌న వ్య‌క్తం చేశారు. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఆయా గ్రామాల ప్రజలు, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, జడ్పీ చైర్మన్ , ములుగు ఎమ్మెల్యే దృష్టికి, పలుమార్లు తీసుకెళ్లడం జరిగింద‌న దీనిపై స్పందించిన జడ్పీ చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయించడం జరిగింద‌న్నారు. సబ్ స్టేషన్ స్థలానికి సంబంధించి గ్రామస్తులు 98 సర్వే నెంబర్లు 30 గుంటల స్థలాన్ని అధికారులకు కేటాయించడం జరిగిందని సబ్ స్టేషన్ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా గత రెండు నెలల నుంచి విద్యుత్ ఉపకేంద్రం పనులు జరుగుతుండగా అట‌వీశాక‌ అధికారులు ఏట్టి పరిస్థితులలో పనులు చేయడానికి వీలులేదని కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నార‌న్నారు.

గత వారం రోజుల నుండి పనులకు ఆటంకం కలిగిస్తూ అక్కడున్నటువంటి పరికరాలను వెనక్కి పంపిస్తున్నారని అని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రెండు రోజుల్లో ఉపకేంద్రం పనులకు క్లియరెన్స్ ఇవ్వాలని లేని పక్షంలో ఈ నెల 16వ తారీకున ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు చిన్నబోయినపల్లి 163 జాతీయ రహదారిపై పదివేల మందితో ఆందోళన కార్యక్రమం చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు వడ కాపురం సారయ్య, ఏటూరు నాగారం వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, చిన్న బోయినపల్లి గ్రామ సర్పంచ్ (చేల లక్ష్మి) వినయ్, యం డి యాకుబ్, తుమ్మ నరసింహారెడ్డి, గంగు యాకుబ్ రెడ్డి, దూడ సోమయ్య, గంట నారాయణ, ఎస్కే అక్బర్ బాషా, కళ్ళ వెంకన్న, బట్టు హనుమంతు, శ్రీరామ్ నాగేంద్ర, స్వాతి, రామ్ రెడ్డి, వెంకన్న, శరత్, సురేష్, రవి, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Read More: మంత్రి హరీష్ రావు ఇలాకాలో కలెక్టరేట్ భవనం ఎక్కి రైతుల నిరసన

Advertisement

Next Story