- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యవసాయ బిల్లులకు వచ్చిన అధికారులను నిర్బంధించిన కర్షకులు
దిశ, నల్లబెల్లి: పంటలకు సరిపడా కరెంటు ఇవ్వకుండా బిల్లులకు ఎలా వస్తారంటూ సంబంధిత విద్యుత్ అధికారులను బాధిత రైతులు గదిలో నిర్బంధించి నిరసన తెలిపిన సంఘటన నల్లబెల్లి మండలంలో శనివారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే నీళ్లు లేక తమ పంటలు ఎండుతున్నాయని, కనీసం 9 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లబెల్లి మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో వ్యవసాయ బిల్లులకు స్థానిక విద్యుత్ అధికారులు వెళ్లారు.
ఈ క్రమంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదంటూ బాధిత రైతులు నిలదీశారు. బిల్లులకు వచ్చిన అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో విద్యుత్ అధికారులను వేసి తాళం పెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు ఎం.లక్ష్మణ్ రెడ్డి, నరేష్ రెడ్డి, ముకుందరెడ్డి, కొమురరెడ్డి, రవీందర్ రెడ్డి, కొనకటి సాంబయ్య, ఏడాకుల కుమారస్వామీ తదితరులు పాల్గొన్నారు.