'civil hospital : సివిల్ ఆసుపత్రిని నెక్కొండకు షిఫ్ట్ చేయాలి..'

by Sumithra |
civil hospital : సివిల్ ఆసుపత్రిని నెక్కొండకు షిఫ్ట్ చేయాలి..
X

దిశ, నెక్కొండ : నర్సంపేటలో ఉన్న సివిల్ ఆసుపత్రిని ( civil hospital ) నెక్కొండకు షిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంగని. సూరయ్య డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో అతి పెద్ద మండలమైన నెక్కొండలో సుమారు 50 వేల జనాభా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారని, ప్రభుత్వం మారడంతో ప్రజల ఆశ కలగానే మిగిలిపోయింది అన్నారు. నెక్కొండ, చెన్నారావుపేట, గూడూరు, పర్వతగిరి, కేసముద్రం మండలాల్లోని గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని వాపోయారు. సివిల్ ఆసుపత్రిని వర్దన్నపేటకు తరలించే కుట్ర చేస్తున్నారని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు సమస్యను ఎమ్మెల్యే, వైద్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సివిల్ ఆసుపత్రి ఇక్కడకు వచ్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ నాయకుల పై, కార్యకర్తల పై వేధింపులకు పాల్పడడం మానుకోవాలన్నారు. తండాలకు కేటాయించిన రహదారులను సైతం అటకెక్కించారని అన్నారు. పేద ప్రజల పై ఎమ్మెల్యేకు ఏమాత్రం శ్రద్ధ ఉన్నా తక్షణమే సివిల్ ఆసుపత్రిని నెక్కొండ షిఫ్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో దీపావళి తర్వాత సివిల్ ఆసుపత్రి సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మారం.రాము, మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, నాయకులు కొమ్ము.రమేష్ యాదవ్, రవీందర్ రెడ్డి, గుంటుక.సోమయ్య, శివ కుమార్, సురేష్, సాంబయ్య, హరి కిషన్, వాగ్యా నాయక్, భద్రయ్య, శ్రీను, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed