- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడే చస్తా.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు
దిశ, రఘునాథపల్లి: 'స్టేషన్ ఘన్‌పూర గడ్డపై పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ప్రాణం ఉన్నంతవరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుని ఇక్కడే చస్తాను' అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. గురువారం రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ వెంకటేశ్వర గార్డెన్‌లో ఖిలా షాపూర్ క్లస్టర్ - 2 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలే తన దేవుళ్ళని, నియోజకవర్గమే తన దేవాలయమన్నారు. బ్రతికి ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేసుకునేలా తనను దీవించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిందని, ప్రజలందరూ మరోసారి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు మన రాష్ట్రంలో అమలు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అంతకు ముందు కురుమ గూడెంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న కురుమ సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు నామాల బుచ్చయ్య, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వై.కుమార్ గౌడ్, జడ్పీటీసీ బొల్లం అజయ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మున్సిపల్ విజయ్ కుమార్, కంచనపల్లి పీఏసీఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్, మార్కెట్ డైరెక్టర్ మాళ్ల రాజు, మాజీ సర్పంచ్ పెళ్లి మల్లారెడ్డి, మహిళ నాయకురాలు మడ్లపల్లి సునీత వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.