- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలి
దిశ,వరంగల్ బ్యూరో : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అడవిముత్తారం పోలీసుస్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది పని తీరు తెలుసుకుని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, పీఎస్ కేసుల స్థితిగతులు, నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి మహేంద్ర కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, పేకాటపై ఉక్కుపాదం మోపాలని కోరారు. అలాగే పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. మండలంలో మావోయిస్టులు ఎలాంటి చర్యలకు దిగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని, పోలీస్ స్టేషన్లోని రికార్డులను ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, కాటారం సీఐ నాగార్జునరావు, స్థానిక ఎస్ఐ మహేంద్ర కుమార్, సీసీ ఫసియొద్దీన్, పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- SP Kiran Khare