- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యుత్తమ ప్రతిభ చూపిన కేయూ విద్యార్థులు
దిశ, కేయూ క్యాంపస్: భారత దేశం జీ-20 దేశాల అధ్యక్షత నేపథ్యంలో తెలంగాణా రాజ్ భవన్ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త వ్యాసరచన, వ్యక్తిత్వం, జీ 20 లోగో పోటీలలో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలలో రాష్ట్ర స్థాయిలో 8 బహుమతులు పొందినట్టు నోడల్ ఆఫీసర్ ఆచార్య కనకరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిత్వ పోటీ(ఉర్దు మాధ్యమంలో) మొదటి ప్రైజ్ హాసం రజాక్(యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ); రెండవ ప్రైజ్(ఇంగ్లీష్ మాధ్యమంలో) క్రుతికా ప్రియా చందన్ (మహిళ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ సి.ఎస్.సి. & ఐటీ డిపార్టుమెంటు); రెండవ ప్రైజ్ (తెలుగు మాధ్యమంలో) బి చాముండేశ్వరి(సరస్వతి డిగ్రీ కాలేజీ, ఖమ్మం); వ్యాసరచన పోటీలో తెలుగు మాధ్యమంలో టి. అంజలి దేవి(విశ్వవిద్యాలయ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ), ఇంగ్లీష్ మాధ్యమంలో బి ధరణి (డిపార్టుమెంటు అఫ్ కెమిస్ట్రీ, యూనివర్సిటీ కాలేజీ), హిందీ మాధ్యమంలో జయిదా తస్లీం(కాకతీయ డిగ్రీ కాలేజీ, హన్మకొండ), ఉర్దూ మాధ్యమంలో సయ్యద్ ఫర్హీన్, షైక్ అసమా సుల్తానా (ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కాలేజీ, ఖమ్మం) విజేతలకు జ్ఞాపిక, సర్టిఫికేట్, నగదు పారితోషికంను తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నుంచి అందుకున్నారు. వీరిని వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ ఆచార్య టి. శ్రీనివాస రావు అభినందించారు.