Hanumakonda District Collector :మంత్రి ఎర్రబెల్లిని కలిసిన కొత్త కలెక్టర్ సిక్తా పట్నాయక్

by sudharani |   ( Updated:2023-02-07 07:34:13.0  )
Hanumakonda District Collector :మంత్రి ఎర్రబెల్లిని కలిసిన కొత్త కలెక్టర్ సిక్తా పట్నాయక్
X

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హనుమకొండ ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా సమస్యలు, పరిష్కారాలపై మంత్రి వివరించారు.

జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని.. నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకుని వెళ్లాలని ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story