- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపటి నుంచి ఆ జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలు..
దిశ, కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ జే. సురేందర్ రెడ్డి తెలిపారు. గురువారం (రేపు) నుంచి 7 రోజులు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరూ గుమికూవద్దని ఎస్పీ బుధవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముందస్తుగా రేపు భూపాలపల్లి పట్టణంలో 144 సెక్షన్ విధించడం జరిగిందని అనవసరంగా ఎవరూ బయటకి రాకూడదని పేర్కొన్నారు.
మంగళవారం ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవలు, దాడుల విషయంలో రెండూ పార్టీల కార్యకర్తల మీద కేసులు నమోదు చేశామని, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో చర్చలకు ఎవరికి ఎటువంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రానికి నలుమూలల నుంచి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వస్తారని, ప్రజలకు ఇబ్బంది కలిగించ వద్దని రాజకీయ పార్టీలకి ఎస్పీ సూచించారు. గురువారం నిర్వహించనున్న బహిరంగ చర్చ కార్యక్రమాన్ని విరమించుకోవాలని, ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలేది లేదన్నారు. చట్ట పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.