అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

by samatah |
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి
X

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలివెల మండలంలోని కామనపల్లి గ్రామంలో రాత్రి 11 గంటలకు ట్రాక్టర్ ముందు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి గోతిలో పడింది. ఈ ప్రమాదంలో కుర్సం సంబమూర్తి(18 ) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరి‌కి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. ట్రాక్టర్ బాగు చేయించడంకోసం వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed