Flood : మేడిగడ్డ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

by Aamani |
Flood : మేడిగడ్డ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
X

దిశ,కాటారం : భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం రోజంతా వర్షం పడుతూనే ఉంది. వాతావరణ శాఖ విడుదల చేసిన ఎల్లో అలర్ట్ ప్రకటనతో భూపాలపల్లి జిల్లాలో మరో రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉంది. మానేరు, గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. అన్నారం బ్యారేజీలో 119.00 మీటర్లు లెవల్ కు 107.01 లెవల్ లో గోదావరి నదికి 16,870 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని సరస్వతి బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరి తెలిపారు. కాళేశ్వరం వద్ద 101.16 మీటర్లు వరద ప్రవాహం కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరువగా ఉన్నది. ఆదివారం రాత్రి 9 గంటలకు అందిన సమాచారం ప్రకారం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 6,07,700 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

బ్యారేజ్ లో 100 మీటర్లు గరిష్ట స్థాయి కాగా. 94.90 మీటర్లు వరద నీరు ప్రవహిస్తోంది. గంట గంటకు ఇక్కడ వరద పెరుగుతూనే ఉంది.మేడిగడ్డ బ్యారేజీ కి ఉన్న 85 గేట్లన్నీ గతంలోనే పూర్తిగా ఎత్తివేశారు. గోదావరి నదికి రెండు వైపులా ఒడ్డు వరకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని, ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలలోకి భారీగా వరద నీరు చేరుతుంది. జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు. మహాదేవపూర్ లో 20.8 ,పలిమెల లో 76.8, మహాముత్తారం లో 33.8 ,కాటారం లో 25.5 , మల్హర్రావు 53.3 లో, చిట్యాల లో 31.3 ,టేకుమట్ల లో 45.5 , మొగుళ్లపల్లి లో 22.8 , రేగొండ లో 48.8 , పలిమెల లో 48.00, ఘనపూర్ లో 29.8 , భూపాలపల్లి మండలంలో 41.8 మిమీ వర్షపాతం నమోదైంది.

Advertisement

Next Story