బీఆర్ఎస్‌కు షాకిచ్చిన మహిళా నేత.. పదవికి రాజీనామా

by samatah |
బీఆర్ఎస్‌కు షాకిచ్చిన మహిళా నేత.. పదవికి రాజీనామా
X

దిశ,మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం స్థానిక జడ్పీటీసీ అధికార బీఆర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది. గార్ల మండలం మర్రిగూడెం గ్రామపంచాయతీ చెందిన గార్ల జడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానం చేసిన పనులు కావడం లేదని, గార్ల -రాంపురం హై లెవెల్ బ్రిడ్జి, రెగ్యులర్ లేడీ డాక్టర్, అదేవిధంగా పొంగులేటి శీనన్నను సస్పెండ్ చేసినందుకు, కేసీఆర్ ఎన్నో హామీలు ఇస్తూ బంగారు తెలంగాణ సాధించుకుంటామని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి,నిధులు ఇవ్వకుండా ఎక్కడ తిరగని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 పేపర్ ను లీక్ చేయడం జరిగిందని, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు అనేకమంది కోచింగ్ తీసుకుని మోసపోతున్నారని, రాష్ట్రంలో బతికేటటువంటి పరిస్థితి లేదని, రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

Advertisement

Next Story