- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బండి సంజయ్ ను ఎంపీ పదవి నుంచి భర్తరఫ్ చేయండి..
దిశ,దేవరుప్పుల (పాలకుర్తి): పరీక్ష పేపర్ లీకేజీ సూత్రధారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నేనని ఆరోపిస్తూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆయనను ఎంపీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తుంటే జీర్ణించుకోలేక బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు.
తన అనుచరులతో పేపర్ లీకేజీ చేయించి దాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యంగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రకటనలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పోశాల పవన్ గౌడ్, నాయకులు పసుల వెంకటేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గర్వందుల మల్లేష్, గజ్జి సంతోష్ కుమార్, పసులది ప్రశాంత్, లకవత్ వెంకటేష్, రేగుల కృష్ణ, జిట్టబోయిన కొంరెల్లి తదితరులు పాల్గొన్నారు.