మంత్రి హరీశ్ రావును కలిసిన ఆర్‌బీ‌ఎస్‌కే ఉద్యోగులు.. డిమాండ్లు ఇవే!

by Dishaweb |   ( Updated:2023-08-27 12:36:11.0  )
మంత్రి హరీశ్ రావును కలిసిన ఆర్‌బీ‌ఎస్‌కే ఉద్యోగులు.. డిమాండ్లు ఇవే!
X

దిశ, హన్మకొండ టౌన్: ఆర్‌బీ‌ఎస్‌Harish Raoద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం మంత్రి హరీశ్ రావును కలిసి అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆర్‌బీ‌ఎస్‌కే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, మినిమం టైం స్కేల్ కల్పించాలని, ఉద్యోగులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లలో 30 మార్కుల వెయిటేజ్, గరిష్ట వయోపరిమితి పెంచాలని, ఆర్‌బీఎస్‌‌కే ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, రిస్క్ అలవెన్స్ కల్పించాలని, 510 జీవో ఇంప్లిమెంట్, కారుణ్య నియామకాలు, 7 నెలల బకాయిలు చెల్లించాలని, తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని లేఖలో డిమాండ్ చేశారు. హరీశ్ రావును కలిసిన వారిలో ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డా॥ వీ. మోహన్ రావు, అధ్యక్షులు డా. జీ.రవీందర్, ప్రధాన కార్యదర్శి డా. డి.కుమార్, కోశాధికారి డా. బి.దుర్గాప్రసాద్‌లు ఉన్నారు.

Advertisement

Next Story