- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగంపేట చెరువు మత్తడి రోడ్డుకు మోక్షం..
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామ శివారు ఎల్గూర్ చెరువు మత్తడి రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల దిశలో ప్రచురితమైన కథనాలతో ఆర్అండ్ బీ అధికారులు స్పందించారు. గత ఏడాది నవంబర్‌లో ప్రచురితమైన కథనాలతో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించారు. ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించడం సత్ఫలితాలిచ్చింది. ఎల్గూర్ రంగంపేట మత్తడి కోసం రూ.2కోట్ల 80 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లుగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య గార్ల సూచనలతో త్వరితగతిన మత్తడి రోడ్ పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. శనివారం జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, పంచాయితీ రాజ్ డి.ఈ జ్ఞానేశ్వర్, ఏసీ రఘువీరారెడ్డి, అభిరామ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈ, ఏఈ స్థానిక సర్పంచ్ ఇజ్జగిరి స్వప్న అశోక్ మత్తడి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మత్తడి రోడ్డు కోసం నూతన సీసీ రోడ్డు కోసం రూ. 2 కోట్ల 80 లక్షల నిధులను కేటాయించినడానికి కృషి చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.