- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేఎంసీలో ర్యాగింగ్ జరగలేదు..ప్రీతి ఆత్మహత్యాయత్నంపై కమిటీ: డీఎంఈ రమేష్‌రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి వైద్యం వివరాలను రమేష్‌రెడ్డి ఆరా తీశారు. ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. గురువారం నాడు నిమ్స్ ఆసుపత్రి వద్ద డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మెడికో ప్రీతిపై ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి ప్రకటించారు.
ప్రీతి, సైఫ్ మధ్య ఉన్నవి మనస్పర్థలు మాత్రమేనని...జూనియర్లతో సీనియర్లు ఏవిధంగా చెబుతారో ఇక్కడా అదే జరిగిందని అన్నారు. కానీ, ప్రీతి విషయంలో కొంచెం ఇబ్బంది కరంగా జరిగినట్లుందని చెప్పారు. ప్రీతితో పనిచేసే ఇతర మెడికోలను కూడా ఈ విషయమై విచారణ చేస్తే కానీ వాస్తవాలు బయటకు రావన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి రెండు రోజుల ముందే వీరిద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చామన్నారు. ఘటనపై కమిటీ వేసినట్లు చెప్పారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
ప్రీతి ఆత్మహత్యాయత్నంపై కమిటీ...
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నంపై కమిటీ ఏర్పాటైంది. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను విశ్లేషించడానికి ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటినీ ఏర్పాటు చేశారు. కమిటీ ద్వారా వారు దర్యాప్తు చేసిన సమాచారం రిపోర్టును సీల్డ్ కవర్లో డీఎంఈకి అధికారులు ఇవ్వనున్నట్లు తెలిపారు.