పంచాయతీ కార్యదర్శి హత్య పట్ల నిరసన

by Aamani |
పంచాయతీ కార్యదర్శి హత్య పట్ల నిరసన
X

దిశ, మంగపేట : పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో వాజేడు మండలం పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు. దానిని నిరసిస్తూ మండల పంచాయతీ కార్యదర్శలు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లో ఎన్నో సమస్యలతో ఉద్యోగ బాధ్యతలు చేస్తున్న తమను అటు పోలీసులు విప్లవ గ్రూపుల కొరియర్లుగా, ఇటు మావోయిస్టులు పోలీసుల కొరియర్లుగా వేదిస్తూ హత్యలను చేయడం దారుణమన్నారు.

పంచాయతీ కార్యదర్శి నిజంగా పోలీసు కొరియరే అయితే చంపకుండా ప్రజా కోర్టులో శిక్షించవలసి ఉండేనని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కలిసి తిరిగిన రమేష్ ఇక తమ మద్యలో లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయామని రేపటి నుండి నీ జ్ఞాపకాలతో ఎలా డ్యూటీలు చేయాలని ఆయన భార్య పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలం లో 25 గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed