ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : Seethakka

by Dishaweb |   ( Updated:2023-08-23 14:09:34.0  )
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : Seethakka
X

దిశ, ములుగు ప్రతినిధి: బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తె మన బ్రతుకులు మారుతాయి అని నమ్మిన అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచిన పరిస్థితి ఉంది.కరోనా మహమ్మారి కాలం లో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారు అన్ని పనులను నిర్వర్తిస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆశాలకు నేటికీ ఫిక్సుడ్ జీతం లేక ఆశా వర్కర్లు అన్యాయానికి గురవుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అశాలకు ఇస్తున్న పారితోషికం 18 వేలు ఇవ్వాలి, టిబి స్పూటమ్ డాబ్బలను ఆశావర్కర్ల తో మోపించే పనిని రద్దు చేయాలి.

టిబి లెప్రసి కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, ఆశా ల పని భారం తగ్గించాలి. జాబ్ ఛార్జ్ ను విడుదల చేయాలి, 2021 జులై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పి ఆర్ సి ఎరియల్స్ వెంటనే ఇవ్వాలని క్వాలిటీ తో కూడిన 5 యేండ్ల పెండింగ్ యూనిఫాంలు ఇవ్వాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed