- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీడీఎస్ బియ్యం పట్టివేత.. పోలీసుల అదుపులో మిల్లు యజమాని
దిశ , ఆత్మకూర్ : విశ్వసనీయ సమాచార మేరకు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ దందా నిర్వహిస్తున్న వారిని, మిల్లు యజమానిని అదుపులోకి తీసుకున్నామని ఆత్మకూర్ ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుకుళ్ళ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్ యందు, పీడీఎస్ రైస్ దందా జరుగుతుందని సమాచారం రాగ, వెంటనే అట్టి రైస్ మిల్లు వద్దకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాహనాలలో సుమారు 27 క్వింటాళ్ల 60 కిలోల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సుమారు వాటి ధర రూ. 49,680ఉన్నట్లు సమాచారం.
కాగా, రైస్ మిల్ ఓనర్ అయిన తాడిపత్రి రాజేశ్వరరావును,పీడీఎస్ బియ్యంను అక్రమంగా గ్రామాలలో కొనుగోలు చేసి రైస్ మిల్ వద్దకి తరలిస్తున్న దుగ్గొండి మండలం గ్రామస్తులు అయినా ఎడ్డబోన రాజ్ కుమార్, పవన్, ములుగు మండల అన్న కటయ్య, కోరే ప్రసాద్, భూక్య చందు, రమేష్ లను పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని పట్టుకున్న వారిలో .టి సత్యనారాయణ, ఎస్ఐ సుమన్, పోలీస్ సిబ్బంది అయిన శ్రీనివాస్, స్వామి, సులేమాన్, కరుణాకర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.