ములుగులో గులాబీ జెండా రెపరెపలు..

by Kalyani |
ములుగులో గులాబీ జెండా రెపరెపలు..
X

దిశ, ములుగు ప్రతినిధి: మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సమావేశం జరిగింది. ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్, ఆత్మీయ సమ్మేళనాల పరిశీలకులు అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట గట్టమ్మ దేవాలయం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ లీల గార్డెన్ వరకు నిర్వహించారు. లీల గార్డెన్ లో బీఆర్ఎస్ జెండాని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం అమలు చేయలేదని, కళ్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి రాష్ట్ర సచివాలయానికి సైతం అంబేద్కర్ పేరును పెట్టిన ఘనత కేసీఆర్ ది అని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను జనంలోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో ములుగులో గులాబీ జెండా ఎగరవేయడమే మన ముందున్న పని అని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పరిశీలకులు అరికెల నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా తయారైందని అన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలోని నియోజక వర్గ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసిఆర్ దేనని, రాష్ట్రంలో తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి బీడు భూముల దాహార్తిని తీర్చి పంట దిగుబడులు పెంచిన ఘనత కూడా కేసిఆర్ దేనని, దళిత బందు, రైతు భీమా, రైతు బందు, ఎన్నో సంక్షేమ పథకాలను ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed