ఎమ్మెల్యే విన‌య్‌ భాస్కర్‌ ప్రధాన అనుచ‌రుడు అరెస్ట్.. ఖ‌మ్మం సెంట్రల్ జైలుకు త‌ర‌లింపు

by Mahesh |   ( Updated:2023-01-21 13:42:14.0  )
ఎమ్మెల్యే విన‌య్‌ భాస్కర్‌ ప్రధాన అనుచ‌రుడు అరెస్ట్.. ఖ‌మ్మం సెంట్రల్ జైలుకు త‌ర‌లింపు
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్ : భూ కబ్జా ఆరోపణల్లో భాగంగా జీడ‌బ్ల్యూఎంసీ ఏడో డివిజన్ బీఆర్ఎస్‌ కార్పొరేటర్‌, ఎమ్మెల్యే విన‌య్‌ భాస్కర్ ప్రధాన అనుచ‌రుడు వేముల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాకు య‌త్నించిన‌ట్లుగా బాధితుల ఫిర్యాదు మేరకు కార్పోరేట‌ర్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్​ క్లాస్​మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంత‌రం ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2 లోని 200 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్​ డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ఓనర్​సునీత దంపతులను హెచ్చరించాడు.

వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్​మీదికి వెళ్లి కాంపౌండ్​వాల్‌ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతో పాటు ఆస్తి ధ్వంసం చేయడం తో బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవి రంగనాథ్​ఆదేశాలతో కార్పొరేటర్​వేముల శ్రీనివాస్​తో పాటు అతడి డ్రైవర్​పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​జేఎఫ్‌సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్​ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed