- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి.. మరిపెడ సెంటర్‌లో చెప్పుతో కొడతా: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు
దిశ, మరిపెడ (సీరోల్ ): మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలోని చిలుకోయలపాడు గ్రామంలో నిర్వహించిన భారతీయ రాష్ట్ర సమితి మినీ ప్లీనరీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. ప్లీనరీలో భాగంగా బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిని రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి లేక ఎక్కడో సూర్యాపేట నుంచి వచ్చి పోటీ చేస్తున్నారని.. అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లేరని.. అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. నామీద దొరలు, పెద్ద పెద్దోళ్ళు పోటీ చేసినా కూడా నన్ను ఓడించలేకపోయారని.. నేను నీతిపరున్ని కాబట్టే నన్ను ఇప్పటికీ గెలిపిస్తున్నారని అన్నారు.
అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మరిపెడ పట్టణ కేంద్రానికి వచ్చినప్పుడు రేవంత్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘‘ఒరేయ్ బోసిడికే రేవంత్ రెడ్డి.. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాపైన చేసిన నింద ఆరోపణలు రుజువు చెయ్. అది నిజమని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకుంటే మరిపెడ సెంటర్లో చెప్పు దెబ్బలు తింటావా అని సవాల్ విసిరితే ఇప్పటివరకు ఏ నా కొడుకు జాడ పత్త లేకుండా పోయాడు’’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా బాగు చేస్తారా అంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేకపోతున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదుగుతే జానారెడ్డి కాళ్ళు లాగుతాడు.. జానా రెడ్డి కాళ్ళు కోమటిరెడ్డి లాగుతాడు.. కోమటిరెడ్డి కాళ్లు జగ్గారెడ్డి లాగుతాడు.. వారిలో వారికి సఖ్యత ఉండదు.. వీలు కొట్టుకుందానికే టైం ఉండదు అని ఎద్దేవా చేశారు. డోర్నకల్‌లో నా గెలుపును ఎవరు ఆపలేరని.. కేసీఆర్ ఇచ్చే ఫలాలు కాంగ్రెస్, బీజేపీ, ప్రతిపక్ష నాయకులకు అందడం లేదా మమ్మల్ని విమర్శించే వాళ్ళు మా ఫలాలను కూడా తీసుకోవద్దు అంటూ ప్రతిపక్షాలకు చురకలాంటించాడు. ఈ సమావేశం అనంతరం మరిపెడలో జరిగిన ప్లీనరీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ కవిత పాల్గొన్నారు. అక్కడ కూడా ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దే అధికారం - ఎంపీ కవిత
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు అయ్యే సంక్షేమ పథకాలన్నీ చూసి మిగతా రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో ఏ నేత కూడా ఇంత మంచి పథకాలను తీసుకురాలేదని.. మహారాష్ట్రలో కూడా మాదే అధికారం వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావ్, బీఆర్ఎస్ యువ నాయకుడు రవిచంద్ర, ఏడు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.