- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Ramachandranayak : డోర్నకల్ అభివృద్ధి లక్ష్యంగా పని చేద్దాం
దిశ,డోర్నకల్ : మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రునాయక్ అన్నారు.పుర చైర్మన్ వీరన్న అధ్యక్షతన గురువారం పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. పారిశుధ్య నిర్వహణతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తొలుత సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ లో కరస్పాండెంట్ ఆంతోని,ప్రిన్సిపల్ హెలెన్ రాణి నేతృత్వంలోని కేబినెట్ సభ్యుల నియమాక కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యేకు గౌరవ వందనం చేశారు.చిన్నారులు వివిధ సాంస్కృతిక ఆటపాటలతో సందడి చేశారు.అలాగే బ్రిలియంట్ హై స్కూల్ నందు అన్ని హంగులతో నిర్మించిన నర్సరీ పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థులు ఐఐటి, మెడిసిన్ లో సీటు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.ముదిరాజులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.హెల్త్ సబ్ సెంటర్ భవనం పూర్తి చేయాలని ఆరోగ్య సిబ్బంది విన్నవించారు.అలాగే రుణమాఫీ సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు అన్నదాతలతో ట్రాక్టర్ల పై భారీ ర్యాలీ తీశారు.సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తహసీల్దార్ బంజారా లో క్షీరాభిషేకం చేశారు.వైస్ చైర్మన్ కోటిలింగం, కౌన్సిలర్లు,కో ఆప్షన్లు,నాయకులు రవీందర్ రెడ్డి,బత్తుల శ్రీనివాస్ యాదవ్,సుమేర్ జైన్,శీలం శ్రీనివాస్, హరికృష్ణ,గంగాధర్,మాదా శ్రీనివాస్,హనుమ,మారబోయిన రామబద్రం, రెడ్డబోయిన శంకర్,భాస్కర్,ఫరీద్,నాని, రమేష్ తదితరులున్నారు.