- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
దిశ, వరంగల్ టౌన్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజల్లోకి తీసుకుపోయి వివరించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని 28వ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన నవీన్, డివిజన్ అధ్యక్షులు మర్రి రవీందర్ అధ్యక్షతన హంటర్ రోడ్ లోని పీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలను ఒక్కొక్కరిగా వారి వారి ఆర్థిక పరిస్థితి, ఎదుగుదలకు కావాల్సిన తోడ్పాటును వారు నివసించే కాలనిలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు గొప్ప పాలన అందిస్తుందని కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మలని ఎమ్మెల్యే అన్నారు.
కార్యకర్తలు పట్టుదలతో పని చేస్తూ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి వారికి అర్ధమయ్యే విధంగా వివరించాలని కోరారు. పార్టీ బలోపేతానికి డివిజన్ల వారికి చేపట్టాల్సిన చర్యలు, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధిపై కూలంకషంగా ఎమ్మెల్యే చర్చించారు. డివిజన్ లోని సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే అందరి సమస్యల పరిష్కారం చూపి కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలందరికి పార్టీలో, ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తామని.. ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గృహలక్ష్మీ, డబల్ బెడ్ రూమ్ ఇతర పథకాలలో అర్హులైన నిరుపేద కార్యకర్తలకు ప్రాధాన్యత కలిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. లీడర్లు కార్యకర్తల మధ్య సమన్వయంతో పనిచేసి మన పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యకర్తలలో కొత్త పాత అనే భేదం లేకుండా అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు.
విద్య, వైద్యంలో భాగంగా 1100 వందల కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యారంగంలో బాగంగా 7 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చామన్నారు. 75 కోట్లతో బస్ స్టేషన్, కురగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, వాడవాడన సీసీ రోడ్లు, మహిళ కార్మిక భవనం, కలెక్టరేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మరెన్నో కార్యక్రమాలను తాను ఎమ్మెల్యే అయ్యాక సాదించుకున్నామని అన్నారు. 28డివిజన్ లో పలుప్రాంతాలకు వరద నీరు ముంపు కలుగుతుందని ఆ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 156 కోట్ల రూపాయలతో ప్లాన్ సిద్ధం చేసామని అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా మీ ఇంటి కుటుంబ సభ్యుడిలా మీ వెన్నంటే ఉండి కాపాడుకుంటానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వాన ఇంత గొప్ప ప్రగతిని సాధించుకున్న మనం దానిని ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించాలని కార్యకర్తలను కోరారు. మనం చేస్తున్న ప్రగతి, అభివృద్ధి ఓర్వలేక ఇతర పార్టీలు అక్కసు కక్కితమ పై దుష్ప్రచారం చేస్తున్నారని దానిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే కోరారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని కార్యకర్తలుగా మనం, తెలంగాణ ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ తుమికి రమేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు మర్రి రవీందర్, డివిజన్ ఇంచార్జ్ కుందారపు రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు కొలిపాక శ్రీనాద్, దేవాలయ చైర్మెన్ రాజు, బీఆర్ఎస్ నాయకులు చిట్టిమల్ల రమేష్, శంకర్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.